![]() |
![]() |
.webp)
అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయమవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ పెడుతూ వైరల్ గా నిలుస్తుంది. అయితే తాజాగా ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో కొన్ని బోల్డ్ కామెంట్లు చేసింది అనసూయ.
.webp)
మొన్న రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది.. ఈ జనరేషన్ బాయ్స్ దాదాపు 70 శాతం మంది.. తమకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లతో కోరుకుంటున్నారట. వీళ్ల వయసు 20-25 ఉంటుంది కానీ.. వాళ్లు వాళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 30-35తో ఉండాలని అనుకుంటున్నారట అని తన ప్రశ్నని యాంకర్ అడుగుతుండగా.. ‘సెక్సువల్‌గానా’ అని అడిగింది అనసూయ. అంటే.. అది సెక్సువల్ అని కాదు.. లస్ట్ (కామం) అని అన్నాడు యాంకర్. దాంతో అనసూయ.. లస్ట్ అంటే సెక్సే కదా అని అనేసింది. అంటే నేను వల్గర్ వేలో చెప్పకూడదని అలా అన్నా అని ఆ యాంకర్ అనడంతో.. అది వల్గర్ ఏం కాదు.. సెక్స్ అనేది చాలా అవసరం. దాన్ని జనం ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కావడం లేదు. అలాగని బహిరంగంగా సెక్స్ చేసుకోవాలి.. బహిరంగంగా మాట్లాడుకోవాలని కాదు.. కాకపోతే అయ్యయ్యో అని తప్పుపట్టాల్సిన పనిలేదు. అది అవసరం. దాని గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు. అది మంచిదే అని పచ్చిగా ఆన్సర్ ఇచ్చింది అనసూయ. అంటే.. నిండా 20 ఏళ్లు కూడా రాని నిబ్బా గాళ్లంతా కామంతో తనకంటే పెద్ద వాళ్లైన ఆడాళ్లతో సెక్స్ చేయడం తప్పేం కాదు అన్నకోణంలో అనసూయ చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
అంతేకాదు, "నన్ను ఆంటీ అని కామెంట్స్ చేసేవాళ్ళు.. సెక్సువల్ అప్రోచ్ తోనే చూస్తారు అనిపిస్తుంది. నేను మా ఆయన ఆడదాన్ని. నేను బికినీ వేసుకున్నానా, బట్టలు విప్పి తిరిగానా? అనేది నా ఇష్టం. మనుషుల్లా బిహేవ్ చేయండి." అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇక అననసూయ మామూలుగా మాట్లాడితేనే కామెంట్ల మోత మోగుతుంది. కానీ సెక్స్ గురించి ఇప్పుడు ఏ మాత్రం సిగ్గు పడకుండా మాట్లాడింది. దాంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ గా మారింది. అనసూయ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.
![]() |
![]() |